అమ్మను మించిన అందం ఉందా?   - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మను మించిన అందం ఉందా?  

November 23, 2017

సుమారు 17 ఏళ్ల తరువాత మిస్ వరల్డ్‌ కిరీటం భారత్‌కు దక్కింది. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ కిరీటం దక్కించున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశం గర్విస్తుంటే.. మరోవైపు మోడల్,  బిగ్‌బాస్  మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్ మిస్ వరల్డ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.‘ ఇంకా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారా ? అది డైనోసార్లకాలంలోనే  అంతరించిపోయిందని అనుకున్నాను. అయినా ఈ రోజుల్లో అందాన్ని జడ్జ్ చేయడమేంటీ ? ఇలాంటీ పోటీలను చూస్తుంటే నవ్వస్తోంది. అందం ఉన్నది జడ్జ్ చేయడానికి కాదు. మిస్ వరల్డ్  పోటీల్లో హిజాబ్ వేసుకున్న మహిళ, ట్రాన్స్ జెండర్లు గుండు చేయించుకున్న ఆడవాళ్లు ఎందుకు లేరు ?అంటే వారు అందంగా లేరనా ? మిస్  వరల్డ్ ఎప్పుడో పాతబడిపోయింది.  నిజమైన ప్రపంచ సుందరి అంటే అమ్మ. అమ్మను మించిన సుందరి ఎవరుంటారు ?  ప్రపంచ సుందరి తన అందాన్ని ఎప్పుడు మరొకరు జడ్జ్ చేయాలని  అనుకోదు. మన ప్రపంచం, మన భూమి తన పిల్లల్ని జడ్జ్ చేయదు ’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. సోఫియా  కొన్నాళ్ల క్రితం సాధ్వీగా మారింది. తానింకెప్పుడు అందం జోలికి వెళ్లనని దేవుడి సన్నిధిలోనే జీవితకాలాన్ని గడుపుతానని ప్రకటించింది. కానీ కొంత కాలానికే సన్యాసం విడిచి పెళ్లి చేసుకుంది.