ప్రపంచసుందరిగా మనసున్న మెక్సికో సుందరి

ఈ ఏడాది ప్రపంచ సుందరి ఎవరో తేలిపోయింది.  మెక్సికోకు చెందిన 26 ఏళ్ల వయ్యారి వెనెస్సా పోన్స్‌ డీ లియోన్ ఈ టైటిల్ ఎగరేసుకుపోయింది. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ పోటీలు అట్టహాసంగా జరిగాయి.

ప్రపంచ సుందరి ప్రకటించడానికి కావాలసిన అన్ని అర్హతలు వెనెసాకు ఉన్నాయని జ్యూరీ ప్రకటింది. గత ఏడాది ఈ టైటిల్ గెల్చుకున్న భారతీయ సుందరి మానుషి చిల్లర్.. ఆమె తలపై కిరీటం పెట్టింది.  ఇక మొది రన్నరప్‌గా థాయ్‌లాండ్‌ భామ, నికోలిన్‌ లిమ్స్‌నుకన్‌ నిలిచింది.

erer

118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న తమిళనాడు పిల్ల అనుకృతి వ్యాస్‌ 19వ స్థానంతో సరిపెట్టుకుంది. కొత్త మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఇప్పుడు మోడలింగ్ రంగంలో బిజీగా ఉంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటోంది.