తెలంగాణ బాటలో పాండిచ్చేరి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ బాటలో పాండిచ్చేరి

February 20, 2018

‘మిషన్ కాకతీయ’కార్యక్రమానికి  పాండిచ్చేరి ఫిదా అయింది.  ఈ కార్యక్రమాన్ని తాము కూడా తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాండిచ్చేరిలోని చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ను మోడల్ గా తీసుకున్నట్టు తెలిపారు.

ఈ మేరకు డి.పి.ఆర్.ను సమర్పించామని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు సమకూర్చాలని మల్లాడి కోరారు. తమది చిన్న రాష్ట్రమనీ, నిధుల కొరత ఉన్నందున కేంద్రం తోడ్పాటునందించాలని ఆయన కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్ రామ్ కు విజ్ఞప్తి చేశారు.కావేరి నుంచి తమిళనాడుకు విడుదల చేసే నీటిలో పాండిచ్చేరికి రావలసిన నిష్పత్తి ప్రకారం నీటిని పంపాలని మల్లాడీ కృష్ణా రావు కోరారు. యానాం దగ్గర గోదావరిపై కరకట్ట ల నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలని పాండిచ్చేరి మంత్రి కోరారు.