మిట్టుగాడి వీర ప్రేమగాథ.. తప్పక తెలుసుకోవాలి! - MicTv.in - Telugu News
mictv telugu

మిట్టుగాడి వీర ప్రేమగాథ.. తప్పక తెలుసుకోవాలి!

February 14, 2018

‘ హాయ్ బేబ్.. డ్యూడ్ హౌఆర్ యూ..! జానూ సండే కదా డేట్‌కు పోదామా.. కుర్రకారు.. షికారు.. పార్క్‌లు.. ఫ్యాషన్.. ఆశషిఖీ.. నచ్చితే ప్రేమించుకుందాం.. లేకపోతే బ్రేకప్.. ’ ఇవే రోజూ వాట్సాప్, మెసెంజర్లలో ప్రేమికుల మధ్య చక్కర్లు కొడుతున్న సందేశాలు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లివింగ్ రిలేషన్‌లను పక్కా నమ్ముతున్నారు. కానీ కెరియర్, ఆ కెరియర్ కోసం తమ సర్వస్వాలను ధారపోస్తున్న అమ్మానాన్నల త్యాగాన్ని, కుటుంబం ఆలంబనను మాత్రం తేలిగ్గా తీసిపారేరస్తున్నారు.
మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్యామిలీ డేలకు లేని ప్రాముఖ్యత ‘ వాలైంటైన్స్ డే ’ కు ఎందుకిస్తున్నారు? ప్రేమంటే ప్రేమికుల జాగీరా ? కాదే.. అది ఈ ప్రపంచంలో అందరి సొత్తు. కన్నవాళ్ళ ప్రేమను మించిన ప్రేమ ఏదైనా వుందా ఈ ప్రపంచంలో ? ఈ నేపథ్యంలో ‘ మైక్ టీవీ ’ ఒక చిన్న ప్రయత్నం చేసింది.

‘ మిట్టుగాడి వీర ప్రేమగాథ ’ పేరుతో తీసిన ఈ షార్ట్‌ఫిల్మ్..  అమ్మాయి ప్రేమ కన్నా ముఖ్యమైంది కుటుంబం, చదువు, కెరియర్ అని చెప్పింది. అమ్మాయి తన వాట్సాప్ మెసేజెస్‌కి జవాబు ఇవ్వకపోవడం, తను ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ముందు కొడుకు అన్నం తిన్నాడో లేదోనని తల్లడిల్లే తల్లి ప్రేమ దిగదుడుపేనా ? అక్క ఆరాటం అబద్ధమా ? నానమ్మ మథనం అనవసరమైందా ? ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఈ పొట్టి సినిమా.

అమ్మా నాన్న, అక్కా, చెల్లెలు, అన్నా, తమ్ముడు, నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత, అత్తయ్య, మామయ్యలు, స్నేహితులు.., ఇంతమంది వున్నారు మనం జీవితాంతం ప్రేమించటానికి. కానీ ఎందుకో వీళ్ళందరి ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వస్తోంది సమాజం. పుట్టుక నుంచి అల్లుకున్న ప్రేమలను విస్మరించి అమ్మాయి ప్రేమను స్మరిస్తున్నారు యువత. మరి ప్రేమించుకున్నవారు పెళ్లయ్యాక కూడా అంతే ప్రేమను బతుకంతా కొనసాగిస్తున్నారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? వారి ప్రేమలో ఉన్నది ఆత్మీయత – అమ్మాయి ప్రేమలో వున్నది ఆకర్షణ. ఈ రెండింటి మధ్యనున్న సన్నటి గీతను చెరిపేసి చాలా మంది కుటుంబ ప్రేమలను తక్కెడలో తక్కువ చేశారు. అమర ప్రేమికులై, ఉన్మాద ప్రేమికులై ఆ ప్రేమను తక్కెడలో ఎక్కువ చేశారు. ఏమంటారు..?  మిట్టుగాడి వీర ప్రేమగాథ చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు మైక్ టీవీతో పంచుకోగలరు. ఈ గాథ తర్వాతి భాగం త్వరలోనే మీ ముందుకొస్తుంది..!!