తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా.. బాలయ్య - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా.. బాలయ్య

October 1, 2018

తెలుగుదేశం పార్టీతోనే  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ  టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

Telangana Develop With Telugu Desam Party  TDP MLA Balakrishna

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్. తెలంగాణ అభివృద్ధి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కృషి చేశారు.  తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలి అంటే టీడీపీతోనే సాధ్యం. తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగరడం ఖాయం. మధిర నియోజకవర్గంలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది.. ’ అని బాలయ్య అన్నారు.