జగ్గారెడ్డి రెచ్చగొడుతున్నాడు.. మైక్ టీవీతో చింతా ప్రభాకర్ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

జగ్గారెడ్డి రెచ్చగొడుతున్నాడు.. మైక్ టీవీతో చింతా ప్రభాకర్ ముచ్చట

October 3, 2018

సంగారెడ్డి ఎమ్మెల్యేగా తనదైన ప్రత్యేక ముద్ర వేసిన నికార్సైన రాజకీయ నాయకుడు చింతా ప్రభాకర్. టీఆర్ఎస్ పార్టీకి నమ్మినబంటుగా వుంటూ  రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఆయనను మైక్ టీవీ పలకరించింది.. ముచ్చట పెట్టింది. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. సంగారెడ్డి ఎన్నికలు, రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ నాలుగున్నరేళ్ళు తాను చేసిన అభివృద్ధి గురించి చింతా వివరంగా  చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన తన ప్రత్యర్థి జగ్గారెడ్డికితో ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.

‘కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు, దోపిడీలే ఎక్కువగా వున్నాయి. అభివృద్ధి చేసిన దాఖలాలు మచ్చుకు కూడా లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డిని అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తన బాధ్యత మంత్రి హరీశ్ రావు తీసుకున్నా నేనున ఎల్లవేళలా ప్రజల మధ్యే వుంటాను.. ’ అని చెప్పారు. ఈసారి గెలిస్తే తప్పకుండా ఇంకా సంగారెడ్డిని, జోగిపేట పట్టణాలను అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో కింది లింకులో చూడండి.