కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అదీ  ట్విటర్లో... - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అదీ  ట్విటర్లో…

December 9, 2017

సినిమా నటుడు పవన్ కల్యాణ్‌పై చిందులేసే కత్తి మహేశ్  ఈసారి బీజేపీపై గురి పెట్టినట్టున్నారు. ఏకంగా దేశ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కత్తి తిప్పాడు. ఇంతకీ మహేశ్ ఏమన్నాడో చదవండి…

‘మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా ! ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోడీ గుజరాత్‌లో చేసింది రైట్ అయిపోతోందా ? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్ ’  అంటూ కత్తి. ప్రధాని పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.  

దీంతో బీజేపీ హైదరాబాద్ పాతబస్తీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మహేశ్‌పై పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి మహేష్ కత్తిపై హైదరాబాద్ పోలీసులకు ఫేస్‌బుక్ సాక్షిగా ఫిర్యాదు చేశారు.

కత్తి కూడా వెనక్కి తగ్గలేదు. రాజాసింగ్ ఫిర్యాదుకు స్పందిస్తూ ‘ నాకు చట్టం తెలుసు.. చట్టం తెలియని ఎమ్మెల్యే ’ అంటూ మరో పోస్టుతో తను వివరణ ఇచ్చాడు.

కత్తిపై రాజాసింగ్ స్పందన ఇది :

‘మహేశ్  కత్తికి ఎప్పుడూ వార్తల్లో నిలవాలనే కుతూహలం ఎక్కువయింది. చౌకబారు పబ్లిసిటీ కోసం ప్రధాని మీద ఆరోపణలు చేస్తాడా ? ఇది ఎంతమాత్రమూ సముచితం కాదు. మా ప్రియతమ నాయకుణ్ణి విమర్శించిన మహేశ్  కత్తిపై కేసు నమోదు చేయవలసిందిగా హైదరాబాద్ సిటీ పోలీసులకు విన్నవించుకున్నాను ’ తన ట్వీట్ చేశాడు.