ఎమ్మెల్యే భర్త జులుం - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే భర్త జులుం

October 28, 2017

పదవి చేతిలో ఉంటే చాలు,వాళ్లకున్న పవరే వేరు అనుకుంటారు చాలామంది, ఎవ్వర్ని లెక్కచెయ్యరు. పదవిలో ఉన్న వాళ్లకంటే వాళ్ల బంధువులు,భర్తలే ఆ పదవికున్న పవర్‌ను అన్నిరకాలుగా ఉపయోగించుకుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యే భర్త ఇలాగే రెచ్చిపోయాడు. సైలానా నియోజకవర్గ శాసన సభ్యురాలు సంగీత చారెల్ భర్త విజయ్, ఓ టోల్ ప్లాజా దగ్గర తన అనుచరులతో కలిసి టోల్‌ప్లాజాలో ఉన్న వ్యక్తిని చితకబాదారు. ‘నాబండినే ఆపుతవారా’ అంటూ బూతులు తిట్టుకుంటూ, చచ్చేటట్లు కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమేరాలో నమోదయ్యాయి.