భక్తి మ్యూజిక్‌ను సెక్స్ సినిమాకు వాడారు! - MicTv.in - Telugu News
mictv telugu

భక్తి మ్యూజిక్‌ను సెక్స్ సినిమాకు వాడారు!

February 20, 2018

వర్మ తీసిన ‘జీఎస్టీ’ సినిమా ఆసినిమాకు పనిచేసిన అందరి మెడకు చుట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  సీసీఎస్ పోలీసులు  వర్మను విచారించారు. అయితే ఆసినిమాకు పనిచేసిన మరికొంత మందిని కూడా విచారించనున్నారు.  జీఎస్టీకి మ్యూజిక్ ను అందించిన సంగీత దర్శకుడు కీరవాణిని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

అయితే  జీఎస్టీ కథ నాదే అంటూ వార్తల్లో కెక్కిన రచయిత జైకుమార్  కీరవాణిపై తీవ్ర విమర్శలు చేశాడు. పవిత్రమైన ఓంకారంను  కీరవాణి జీఎస్టీ సినిమాకోసం స్వరపరిచారు. భక్తి మ్యూజిక్‌ను  సెక్స్ సినిమాకు వాడారు, వీరిని ఇలాగే వదిలేస్తే రేవు మియామాల్కోవా లాంటి వాళ్లకు గుడి కూడా కడతారు’ అని ఆయన అన్నారు.

భక్తి మ్యూజిక్ ను ఇలాంటి బూతు వీడియోకు వాడినందుకు తాను ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమార్ అన్నారు. అంతేకాదు ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ అధికారులను కూడా తాను కలవబోతున్నట్లు జైకుమార్ స్పష్టం చేశారు. మరి వర్మ తీసిన జీఎస్టీ ఇంకా ఎందరిని ఇబ్బందుల్లోకి నెడుతుందో చూడాలె.