మీఫోన్‌లో జీపీఎస్ ఉందా..అయితే జర భద్రం - MicTv.in - Telugu News
mictv telugu

మీఫోన్‌లో జీపీఎస్ ఉందా..అయితే జర భద్రం

November 22, 2017

మీరు  ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు, అందులో జీపిఎస్ ఉండే ఉంటుంది. అయితే మీ ప్రతీ కదలిక మీద నిఘా ఉన్నట్టే. మీ జీపీఎస్‌ను డిసెబుల్డ్ మోడ్‌లో పెట్టినా సరే, గూగుల్ మహాతల్లి, మీ ప్రతీ కదలికను ఇట్టే పట్టేస్తుంది. మీకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన సర్వర్‌లో భద్రంగా పెట్టుకుంటుంది. ఇదంతా ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు, మీ దగ్గరలో ఉన్న సెల్‌టవర్‌ను ఆధారంగా చేసుకొని మీ సమాచారాన్ని గూగుల్ సేకరిస్తుంది. క్వోడ్స్ అనే సంస్థ..

ఆండ్రాయిడ్ డివైస్ జీపీఎస్ సర్వీసెస్ ద్వారా గూగుల్.. వ్యక్తిగత సమాచారాన్ని ఎలా రాబడుతుందో అనే విషయాన్ని పరిశోధన చేసి బయటపెట్టింది. అయితే గూగుల్ ప్రతినిధులు స్పందిస్తూ ‘ సమాచారాన్ని కేవలం పుష్ నోటిఫికేషన్స్ అందించడంకోసం మాత్రమే  వాడుతున్నట్టు’ తెలిపారు.