సూట్‌కేసులో కుక్కేసి.. అమ్మబోయి.. - MicTv.in - Telugu News
mictv telugu

సూట్‌కేసులో కుక్కేసి.. అమ్మబోయి..

February 8, 2018

ఫోటోషూట్ అని పిలిచి ఓ బ్రిటిష్ మోడల్‌ను కిడ్నాప్ చేశాడో దుర్మార్గుడు.. ఆపై ఆమెకు మత్తు మందులిచ్చి సూటుకేసులో కుక్కి డార్క్‌నైట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఆమెను ధనిక విటులకు సెక్స్ బానిసగా అమ్మేయ్యాలని ప్రయత్నించాడు. ఈ ఘోరం ఇంగ్లండ్‌లో వెలుగు చూసింది. ఈ కేసును ఛేదించిన ఇటలీ పోలీసులు ప్రధాన నిందితుడు హెర్బాను విచారించగా ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయి.

 

ఇంగ్లండ్‌లో తాత్కాలికంగా నివసిస్తున్న 20 ఏళ్ల మోడల్  క్లోహి అయిలింగ్ ఫోటోషూట్ కోసం వెళ్ళింది. ఈ కేసులో నిందితుడైన హెర్బాను లండన్‌ నుంచి ఆమెను ఇటలీకి రప్పించి కిడ్నాప్‌ చేశాడు. డార్క్‌వెబ్‌ అనే వెబ్ సైట్లో మూడు లక్షల డాలర్లకు ఆమెను సెక్స్ బానిసగా అమ్మకానికి పెట్టాడు.  

క్లోహి అయిలింగ్ మాట్లాడుతూ ‘ నన్ను అంగడి సరుకుగా అమ్మేందుకు కిడ్నాపర్లు బేరం పెట్టారు. కిడ్నాప్ చేసిన తర్వాత నాకు డ్రగ్స్ ఇచ్చారు. నోటికి గుడ్డ కట్టారు.. కాళ్ళుచేతులు కట్టేసి ఓ బ్యాగులో కుక్కి, కారు డిక్కీలో పడేసి టురిన్‌ శివార్లలో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌కు తరలించారు. అక్కడ కుర్చీకి కాళ్ళుచేతులు కట్టేసి బంధించారు.  నిద్రాహారాల్లేకుండా నరకం అనుభవించాను. నేను రెండేళ్ళ బాబుకు తల్లినని తెలియడంతో గతేడాది జూలైలో మిలాన్‌లోని బ్రిటిష్‌ కాన్సులేట్‌లో నన్ను విడిచిపెట్టారు. నేను పోలీసులను ఆశ్రయించడంతో నేరస్తుడు తప్పించుకోలేదు. నాలా ఏ అమ్మాయికి ఇలా జరగకూడదనుకుంటున్నాను ’ అని వివరించింది క్లోహి. వెంటనే హెర్బాను, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.