రోజు రోజుకు మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. కులం, మతం అంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కారులో వెళ్తున్న ఓ మోడల్ కిందకు లాగి కాల్చిచంపారు. ఈ ఘటన ఇరాన్లో గురువారం చోటు చేసుకుంది.
ఇరాకీ మోడల్ తారా(22) తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక్క ఇన్ స్టాగ్రామ్లోనే తారాకు 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆమె సంప్రదాయాలకు విరుద్దంగా పని చేస్తుందన్న కారణంగా కొదరు ఛాందసవాదులు ఆమెకు దారుణంగా కాల్చి పంపారు. ఈ ఘటపై స్పందించిన ఇరాన్ ప్రభుత్వం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది.
తారా హత్యపై ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అందరు అమ్మాయిల్లాగ తారా ఆమె జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించాలని అనుకుంది. కానీ ఉగ్రవాదులు ఇలా ఆమెను కాల్చి చంపడం చాలా బాధాకరం. స్వేచ్ఛగా జీవించాలనుకునే వారికి ఇక్కడ ఇలా జరుగుతూనే ఉంది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.