mictv telugu

మోదీ షాక్.. సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వేటు

January 10, 2019

ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్నంత పనీ చేశారు. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధిపతి అలోక్ వర్మను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయనను ప్రాధాన్యం లేని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. సీబీఐ చీఫ్‌గా వర్మ పదవీ కాలం మరో 21 రోజుల్లో ముగియాల్సి ఉండింది.

మోదీ సారథ్యంలోని అత్యున్నతాధికార కమిటీ కాసేపటి కింద సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. బలవంతపు సెలవుపై వెళ్లిన వర్మ మంగళవారం తిరిగి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు గడవకముందే ఆయనను సాగనంపారు మోదీ. వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కమిటీ భావించినట్లు తెలుస్తోది. మోదీతోపాటు కమిటీలోని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సిక్రీ.. వర్మను తొలగించాలన్న నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అయితే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.  

Telugu news modi big shock Alok Verma Removed As CBI Chief After Selection Panel Meets

కాగా, తనను తొలగించడానికి కాసేపటికి ముందు వర్మ ఐదుగురు సీబీఐ అధికారులను బదిలీ చేశారు. అక్టోబర్ వర్మను అక్టోబరులో సెలవుపై బలవంతంగా పంపారు మోదీ. తర్వాత ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టేసి, వర్మను తిరిగి నియమించింది. హై పవర్ కమిటీ తిరిగి సమావేశమై, వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునేంతవరకు ఆయన ఎలాంటి విధానపర నిర్ణయమూ తీసుకోవద్దని ఆదేశించింది. హైపవర్ కమిటీలో ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ,  కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. గత ఏడాది సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో… కేంద్ర ప్రభుత్వం ఇద్దరినీ విధులను తప్పించి, సెలవుపై పంపింది. అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. అలోక్ వర్మపై ఆస్థానా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్ గుజరాత్‌కు చెందిన వ్యక్తి కావడంతో మోద ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

నాగేశ్వరరావుకు మళ్లీ పదవి.. 

సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర రావును కేంద్రం నియమించినట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారని అధికార వర్గాలు చెప్పాయి.

 

Telugu news modi big shock Alok Verma Removed As CBI Chief After Selection Panel Meets