మోడీ ఎక్కిన సీప్లేన్ పాక్ నుంచి వచ్చింది - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ ఎక్కిన సీప్లేన్ పాక్ నుంచి వచ్చింది

December 13, 2017

ప్రధాని మోడీ ఎక్కిన సీప్లేన్ పాకిస్తాన్ నుంచి  వచ్చిందని వెల్లడైంది. స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ భారత్‌లో వంద సీప్లేన్‌ సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. అందుక్కావాల్సిన ప్రభుత్వ అనుమతుల కోసం ట్రయల్స్‌ నిర్వహించింది. ‘ కొడాయిక్‌ ఎన్‌181కేక్యూ ’ సీప్లేన్‌ ఆరేబియన్‌ గల్ఫ్‌ ప్రాంతం నుంచి బయల్దేరి పాకిస్థాన్‌లోని కరాచీ మీదుగా ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో కొడైయిక్‌ క్వెస్ట్‌ గిర్‌గామ్‌ ప్రాంతంలో డిసెంబర్‌ 9న ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో కేంద్ర మంత్రులు అశోక గజపతి రాజు, నితిన్‌ గడ్కరీలు పాల్గొన్నారు.

‘ ఎన్‌ 181 కేక్యూ ‘ నెంబర్‌ కలిగిన ఈ సీప్లేన్‌లో ఆ ఇరువురు మంత్రులు ప్రయాణించారు. మరుసటి రోజు అదే ప్లేన్‌లో మోడీ కూడా ప్రయాణించారు. ఆ ట్రయల్స్‌లో భాగంగానే మోడీకి కూడా సర్వీసు అందించి ఉంటుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ సీప్లేన్‌ను తెర మీదకు తీసుకు వచ్చారనే వార్తలు వస్తున్నాయి. మోడీ మాటల ప్రకారం త్వరలోనే ఆయన ప్రభుత్వం స్పైస్‌జెట్‌ సీప్లేన్‌లకు అనుమతిస్తుందని తెలుస్తోంది.