మోదీ సంచలనం.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు

    ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు రైతు సంక్షేమ పథకాలు తీసుకురావాలని యోచిస్తున్న ఆయన ఎవరూ ఊహించని విధంగా అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయిం తీసుకున్నారు.Telugu news Modi govt approves 10 per cent reservation for economically weaker upper casteఅగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఈ కోటా వర్తిస్తుంది. దీనికోసం రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. బీసీ, ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లకు విఘాతం కలిగొచ్చని  పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాంటిదేమీ ఉండదని, ముస్లింలు సహా పలు అగ్రవర్ణాల్లోని పేదలకు కోటా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు బయటికి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని ప్రభుత్వం 60 శాతానికి పెంచే అవకాశముంది,Telugu news Modi govt approves 10 per cent reservation for economically weaker upper caste