డిల్లీకి రమ్మని బాబుకు మోదీ పిలుపు..ఫోన్లో ఇంకేం మాట్లాడారు? - MicTv.in - Telugu News
mictv telugu

డిల్లీకి రమ్మని బాబుకు మోదీ పిలుపు..ఫోన్లో ఇంకేం మాట్లాడారు?

March 8, 2018

టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు ప్రధాని మోదీని కలిసి తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాను సమర్పించారు. మోదీ చంద్రబాబుతో ఫోన్ లో 10 నిమిషాల పాటు మాట్లాడారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం హస్తినాకు రా అని మోదీ బాబుతో అన్నట్లు సమాచారం. అయితే  మోదీ పిలిచినా కూడా ఢిల్లీకి వెళ్లలేమని…చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకోలేమని బాబు మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పష్టం చేశారు.

ఏపీలో ప్రస్తుత పరిస్థితులను, ప్రజల ఆవేదనను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఇప్పటికైనా ఇవ్వొచ్చని మోదీకి చెప్పినట్లు మంత్రులతో జరిగిన అత్యవసర భేటీలో చంద్రబాబు అన్నారు. మోదీ చంద్రబాబుతో ఇంకేం మాట్లాడారు. అసలు ఏం మాట్లాడడానికి బాబును హస్తినా రమ్మన్నాడు అని అందరిలోను ఆసక్తి నెలకొంది. చంద్రబాబు మంత్రులతో ఏర్పాటు చేసిన అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముందు ముందు ఏ విధంగా ముందుకు పోవాలి. హోదాకోసం ఇంకేం చేయాలి అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.