ప్రధానిగా మోడీ అర్హుడా ? అనర్హుడా ? ప్రకాష్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధానిగా మోడీ అర్హుడా ? అనర్హుడా ? ప్రకాష్ రాజ్

February 19, 2018

నటుడు ప్రకాష్‌రాజ్ మరోమారు ప్రధాని మోడీపై తన ట్విటర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించారు. ‘ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అర్హుడా ? అనర్హుడా ? జస్ట్ ఆస్కింగ్.. ’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రకాష్‌రాజ్ ట్వీట్‌పై స్యాండిల్‌వుడ్ ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ మండిపడ్డారు. ‘ ఇంత కాలం తమిళ సేవ చేసి ఇప్పుడు కన్నడిగులకు సేవ చెయ్యడానికి వచ్చావా ? ప్రధానిని విమర్శిస్తున్న నీకున్న అర్హత ఏంటి ? ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే ముందు నీకు ఉన్న అర్హతలు ఏమిటో చెప్పాలి..

నువ్వు రాజకీయ నాయకుడివి కావు, ఆ అనుభవం లేదు, పోని నువ్వు రాజనీతి శాస్ర్త విద్యార్థివా అంటే అదీ కాదు.. జీవితాంతం తమిళనాడులో ఉండిపోయి, అక్కడి ప్రజలకు అన్యాయం జరిగిపోయిందంటూ అనేకసార్లు చెప్పిన నువ్వు ఇప్పుడు కన్నడిగుల సేవ చేయటానికి బయలుదేరావా ?  ’ అంటూ కౌంటర్ విసిరారు.

అంతటితో ఆగకుండా.. ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆరోపణలు చేసే నువ్వు రాత్రికిరాత్రి జాతీయ నాయకుడు అయిపోవాలని చూస్తున్నావా అని హీరో జగ్గేష్ ప్రశ్నించారు. ఈడీ ఎంట్రీ, శశికళకు షాక్, విదేశాలకు నగదు, 100 బ్యాంక్ అకౌంట్లు సీజ్,  పిఎన్బీ స్కామ్.. ఉన్నతాధికారుల విచారణ, ముంబై బ్రాంచ్‌కు  20 డొల్లా కంపెనీలు, పీఎన్బీ స్కాంలో పెద్దల హస్తం…, ఇలాంటివెన్నో వున్నాయి ప్రకాష్ రాజ్ ప్రశ్నించటానికి. అవి వదిలేసి ప్రధాని మీద ఎందుకు పడ్డాడో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.

నన్వు సినీ రంగంలో అడుగుపెట్టే సమయంలో నీ జీవితం ఎలా ఉందో ఒక సారి గుర్తు చేసుకోవాలని హీరో జగ్గేష్ ప్రశ్నించారు. చట్టప్రకారం ప్రశ్నించే హక్కు నీకుంది, ప్రశ్నించు కాదనలేదు, అయితే కాంగ్రెస్ నాయకుల దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వుంది నీ తీరు.. సాటి నటుడు అని కూడా చూడకుండా తగిన బుద్ది చెప్పవలసి వస్తోందని హీరో జగ్గేష్ ప్రకాష్‌రాజ్ మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .