మోడీ మన సుట్టం.. మంచిగ అర్సుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ మన సుట్టం.. మంచిగ అర్సుకోండి

November 23, 2017

నవంబర్ 28 తేదిన మెట్రో రైలును ప్రారంభించడానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.  బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లుపై సమీక్షించారు.  

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాన మంత్రిని స్వాగతించడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  బేగంపేట విమానాశ్రయం ప్రధాన మంత్రి కి రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రులు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 న మధ్యాహ్నం ప్రధానమంత్రి  మెట్రో రైల్ ను ప్రారంభించిన అనంతరం హెచ్.ఐ.సి.సి. లో జరిగే  గ్లోబల్ ఎంట్ర ప్రెన్యుర్ సమ్మిట్‌లో పాల్గొంటారని ఎస్.పి సింగ్ తెలిపారు. హెచ్.ఐ.సి.సి. లో జరిగే  గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుల సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని తెలిపారు. ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విదేశి అతిధులు బస చేసే ప్రాంతంలో పటిష్టమైన భద్రత చేయాలని అన్నారు.  ప్రధానమంత్రి పర్యటించే మెట్రో రైల్‌ను అందంగా అలంకరించాలని సూచించారు. మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధిత ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.గ్లోబల్ ఎంట్ర ప్రెన్యుర్ సమ్మిట్‌కు వచ్చే అతిధులకోరకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్.ఐ.సి.సి లో గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని అన్నారు. అనంతరం పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ సంస్ధల సి.ఇ.ఓ లతో ద్వైపాక్షి క సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశాలలో అమెరికా అధ్యక్షుల సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని తెలిపారు.

పలక్‌నామా పాలెస్‌లో ప్రధానమంత్రి ఇచ్చే విందుకు అతిధులను హెచ్.ఐ.సి.సి నుండి తీసుకోని వెల్లడానికి పకడ్భంది ప్రణాళిక ను రూపొందించాలని ఆదేశించారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 29న గ్లోబల్ ఎంట్ర ప్రెన్యుర్ సమ్మిట్  అతిధులకు గోల్కోండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏరాట్లు చేయాలని ఆధికారులను ఆయన ఆదేశించారు.