మోడీ బ్యాడ్‌బాయ్.. ఆయనను కొట్టేత్తాం.. స్కూలుపిల్లాడిగా శివప్రసాద్‌ - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ బ్యాడ్‌బాయ్.. ఆయనను కొట్టేత్తాం.. స్కూలుపిల్లాడిగా శివప్రసాద్‌

March 20, 2018

చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ నేడు ఓ లాగు, చొక్కా వేసుకుని  స్కూలువిద్యార్థి వేషంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. తలకు స్కూల్‌బ్యాగ్ తగిలించుకుని, చేత్తో పుస్తకాలు, పెన్సిల్‌తో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, ప్రతిరోజూ ఒక్కోవేషంలో ఆయన నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఐదారు తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా నేడు మోడీని అసహ్యించుకుంటున్నారని.. మోడీ అర్థం చేసుకొని వెంటనే రాష్ట్రానికి హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు మాట్లాడిన తీరులోనే ఆయన మాట్లాడటం విశేషం.‘ మోడీ బ్యాడ్‌బాయ్.. ఆయనను కొట్టేత్తాం.. చంద్రబాబు తాత మా భవిష్యత్తు కోసం పోరాడుతుంటే మీరు మాకు నిధులు ఇవ్వరా ? స్టేటస్ అడుగుతున్నా ఇవ్వట్లేదు. ఏమీ ఇవ్వకపోతే ఎట్టాగమ్మా ? మేము మా ప్రజలు ఎలా బతకాలమ్మా ? మా రాష్ట్రం ఎట్టా డెవ్‌లప్ అయ్యేది ? దేవాన్ష్ మేము టీమున్నాము. అందరూ కలిసి ఈ స్కేలుతో కొట్టేత్తాము. ఈ పెన్సిల్‌తో ముఖమంతా గీకేస్తాము.. ఏమనుకున్నారో? మేము అడిగినవన్నీ ధర్మంగా మాకు ఇవ్వాలి ఆ.. ’ అని డిమాండ్ చేశారు.