అందరి ముందు స్కర్ట్ లాగిన ఆకతాయిలు.. గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

అందరి ముందు స్కర్ట్ లాగిన ఆకతాయిలు.. గాయాలు

April 23, 2018

ఏ దుస్తులు వేసుకోవాలన్నది తన ఇష్టమని, స్కర్ట్‌ వేసుకున్నంత మాత్రాన అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎదుటివాళ్ళకు ఇచ్చినట్టు కాదని ఓ మోడల్ ప్రశ్నిస్తోంది. మధ్యప్రదేశ్, ఇండోర్‌లో  సోమవారం రద్దీగా వుండే రోడ్డుపై ఓ మోడల్‌ను ఇద్దరు ఆకతాయిలు సతాయించారు. అసభ్య పదజాలంతో ఆమె వేసుకున్న స్కర్టును లాగే ప్రయత్నం చేశారు. ఆడపిల్లకు ఒంటరిగా అటుంచితే పదిమందిలో అదీ రద్దీగా వుండే నడిరోడ్డుపై కూడా రక్షణ లేదు అనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. తనకు జరిగిన అన్యాయం గురించి సదరు మోడల్ తన బ్లాగ్ ద్వారా రాత పూర్వకంగా తెలిపింది.

https://twitter.com/SharmaAakarshi/status/988160062278352896

 

‘ స్వతహాగా నేనెంతో ధైర్యవంతురాలిని. కానీ ఆ ఆకతాయిలు నన్ను టీజ్ చేస్తున్నా ఎందుకో నేను నిస్సహాయురాలిగా కామ్‌గా చూస్తూ వుండిపోయాను. తప్ప వాళ్ళను ఎదురించలేకపోయాను. నేను యాక్టివా మీద వెళుతున్నాను. అంతే ఇద్దరు పోకిరీలు బైక్ మీద వచ్చారు. అంత మంది జనం మధ్యలో నా స్కర్ట్ లాగటానికి ప్రయత్నించారు.

‘దాని కింద ఏముంది చూపించు’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాళ్లను నేను ఆపేందుకు యత్నించి.. బ్యాలెన్స్‌ తప్పి కిందపడిపోవడంతో గాయాలు అయ్యాయి. చోద్యం చూశారు తప్ప ఎవరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. వారి బైక్‌ నంబర్‌ను కూడా చూడలేకపోయాను. ఎప్పుడూలేనిది నేను ఎంతో నిస్సహాయురాలినని అనిపించింది. నేను చాలా ధైర్యవంతురాలిని. ఆ సమయంలో నేను మౌనంగా వుండిపోయాను. ఆ రాక్షసులు వెళ్లిపోతున్నా నేను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. నా స్నేహితులు దగ్గరిలోని కేఫ్‌కు తీసుకెళ్లారు ’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్కర్ట్‌ వేసుకున్నందుకే ఇలా జరిగిందని ఓ వ్యక్తి అన్నాడని చెప్పింది. అతని మాటలు తనను ఎంతగానో బాధించాయని పేర్కొంది. రద్దీ రోడ్డులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఎవరు లేని వీధుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ చౌహాన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.