మోహన్ బాబు, విష్ణులపై వేధింపుల కేసు - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్ బాబు, విష్ణులపై వేధింపుల కేసు

March 9, 2018

సినీనటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణులపై కేసు నమోదైంది. మోహన్ బాబుకు చెందిన  శ్రీవిద్యా నికేతన్‌లో పనిచేసే ఓ ఉపాధ్యాయిని ఫిర్యాదుపై దీన్ని నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 28న కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె సివిల్ డ్రెస్‌లో హాజరైందని కళాశాల యాజమాన్యం మందలించి, విధుల నుంచి తొలగించింది.హైదరాబాద్‌కు చెందిన బ్యూలా అనే మహిళ తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో 12 వ తరగతి ఉపాధ్యాయురాలిగా చేరింది. రెండు నెలల అనంతరం కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె సివిల్ డ్రెస్‌లో హాజరైందని యాజమాన్యం మందలించింది. దీంతో ఆమె మనస్తాపానాికి గురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తనతోటి టీచరమ్మ కూడా సివిల్ డ్రెస్‌లు వేసుకొస్తే ఏమీ అనకుండా తననే టార్గెట్ చేశారని బ్యూలా తన ఫిర్యాదులో పేర్కొంది.

 దీంతో మోహన్‌బాబు, విష్ణు, విద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కైరనే ఎగునే రిజెన్సీ, అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ జీవరాజుగోపాల్‌, సీఏవో తులసి నాయుడు, వైస్‌ ప్రిన్సిపాళ్లు కిన్షుక్‌ భట్టాచార్య, గ్లోరిదెవ్‌ప్రియలపై సెక్షన్‌ 505, 508 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆమె సమయానికి రావట్లేదు.

దిలా వుండగా విద్యానికేతన్ విద్యా సంస్థల సీఏఓ తులసినాయుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బ్యూలాపై ఫిర్యాదు చేశారు. ఆమె కళాశాలకు సరైన వేళలకు హాజరు కావటంలేదని, డ్రెస్‌కోడ్ కూడా సరిగా లేని కారణంగానే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కైరనే ఎగునే రిజెన్సీ మందలించారని..  శ్రీవిద్యానికేతన్‌ మెయింటనెన్స్‌ సూపర్‌వైజర్‌ బుల్లెబ్బ నాయుడు, గుర్రప్ప నాయుడులను ఆమెతో మాట్లాడమని పంపించగా రూ.5లక్షలిస్తే తానిచ్చిన కోర్టు నోటీసును వెనక్కి తీసుకుంటానని బ్యూలా బెదిరించారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 308, 511రెడ్‌ విత్‌, 34ఐపీసీ సెక్షన్ల కింద బ్యూలాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.