హిందుస్తాన్ హిందువులదే... - MicTv.in - Telugu News
mictv telugu

హిందుస్తాన్ హిందువులదే…

October 28, 2017

రాష్ట్రీయ స్పయం సేవక్ సంఘ్ ఛీఫ్ మోహన్ భగవత్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం ఇండొర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా హిందుస్థాన్ (భారత్ ) కేవలం హిందువులు ఉండటానికే అని ఆయన స్పష్టం చేశారు. హిందుస్తాన్‌లో ఇతర మతస్థులు కూడా జీవించవచ్చు అని తెలిపారు.

జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్ . అమెరికన్ల కోసం  అమెరికా దేశాలు ఉన్నాయి. అలాగే హిందూస్తాన్ హిందువుల కోసం  అని సృష్టం చేశారు. హిందూస్తాన్‌లో హిందువులే కాక మిగతా మతస్తులు కూడా ఉండవచ్చని ఆయన చెప్పారు. ఇక్కడ హిందువులు అంటే భారతమాత బిడ్డలని ఆయన చెప్పారు. పురాతన వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే  వారసులంతా భారతీయులే… అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ తెలిపారు. భారత్‌ని ఏ ఒక్క పార్టీనో , లేక ఒక వ్యక్తి  అభివృద్ది చేయడం అసాధ్యమని, సమాజం కూడా తనవంతుగా కృషి చేయాలని తెలిపారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు ,అభివృద్ది  జరగదని , అందుకోసం సమాజంలోని అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు.

హిందూస్తాన్ కేవలం హిందువులదే అని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ అందరిదని బిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం గురించి మోహన్ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.