పైస..మనిషిని కలుషితం చేస్తుంది.. ఇదో నిదర్శనం ! - MicTv.in - Telugu News
mictv telugu

పైస..మనిషిని కలుషితం చేస్తుంది.. ఇదో నిదర్శనం !

February 2, 2018

అదేదో సినిమాలో చెప్పినట్లు రూపాయి రూపాయి ఏం చేస్తావే అంటే..హరిశ్చంద్రుడితో అబద్ధమానిస్తా, భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతా, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా, ప్రాణ స్నేహితులను సైతం విడగొడతా అన్నదట అగో ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నది అదే.  ముంబాయిలో కూడా అలాంటి సంఘటనే జరిగింది.  ఓ మహిళా పోలీస్ మానవత్వంలో సాయం చేసి పైస మీద ఆశతో చీ అనిపించుకుంది.

ముంబైలో ఓ ఎంబీఏ విద్యార్థిని తన తండ్రితో కలిసి మోటర్ సైకిల్‌పై బ్యాంక్ లో రూ.50,000 నగదు డిపాజిట్ చేయడానికి వెళుతుంది. అయితే తొందరలో స్పీడ్ గా వెళుతున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈక్రమంలో తండ్రీ కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే వెంటనే ఈఘటనపై  పోలీసులకు సమాచారం అందడంతో స్వాతి జాదవ్ అనే మహిళా పోలీస్ వెంటనే అక్కడకు చేరుకుని ఆంబులెన్స్ వచ్చే వరకు  పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లి వారికి ఫస్ట్ ఏయిడ్ ట్రీట్ మెంట్ చేసింది. అయితే ఆ విద్యార్ధి దగ్గర ఉన్న బ్యాగులో డబ్బులు ఉన్నాయని కనిపెట్టిన ఆ పోలీస్, మీరు ఆసుపత్రికి వెళ్లండి. ఆబ్యాగ్ ను స్కూటర్ ఢిక్కీలో పెట్టండి.

స్కూటీని జాగ్రత్తగా చూసుకుంటామని నమ్మించింది. వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకున్నారు. ఆతర్వాత  పోలీస్ స్టేషన్కు వచ్చి చూస్తే డిక్కీలో డబ్బుల బ్యాగు లేదు. పోలీస్ మేడంను అడిగితే నాకేం తెలీదు. బిజీలో ఉండి స్కూటీని గమనించలేదు అని చెప్పింది. అయితే పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలిస్తే  పోలీస్ మేడమే డబ్బులను దొంగిలించినట్లు తేలింది.

రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో మహిళా పోలీస్ చేసిన తప్పును ఒప్పుకోక తప్పలేదు. మానవత్వంతో ఆపదలో ఉన్న వారికి సాయం చేసింది అని ఆ తండ్రీ కూతుర్లు థ్యాంక్స్ చెప్పేలోపే డబ్బు మీద ఆశతో తప్పు చేసి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.