అసలే కోతి..ఆపై మద్యం తాగింది...దాని హంగామా చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

అసలే కోతి..ఆపై మద్యం తాగింది…దాని హంగామా చూడండి!

February 14, 2018

కల్లు తాగిన కోతి దాని హంగామా గురించి అందరం విన్నాం, చూశాం. కానీ ఇక్కడ ఓ కోతి ఏకంగా మందే తాగింది ఇక దాని హంగామా అంతా ఇంతా కాదు. ఫుల్లు రిమ్మమీదున్న కోతీ.. ఊగుతూ బార్లో ఉన్న వారిని ముప్పు తిప్పలు పెట్టింది. బెంగుళూర్‌లోని కమ్మనహల్లిలో ఉన్న దివాకర్ బార్లో ఓ కోతి రోజు వస్తుంది. అక్కడ మందు బాబులు తాగిన తర్వాత మిగిలిపోయిన మద్యాన్ని రోజు రుచి చూస్తుంది.

అయితే ఈమధ్య  ఎవరో మందుబాబు పొట్టలో కంటే గ్లాసులో ఎక్కో మందు వదిలేశాడు. రోజు తాగిన అలావాటులో ఆ కోతి  మొత్తం తాగేసింది. ఇంకేముంది డోస్ ఎక్కువైంది.  బార్‌లో ఉన్న వారి వెంట పడుతూ, చేతికి దొరికిన మందుగ్లాసులు, కూల్ డ్రింక్ లు పారబోస్తూ  నానా హంగామా చేసింది. దాని ముందు పండ్లు, ఫలాలు పెట్టి బోను తెచ్చి పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అది నాకు ఇంకో పెగ్గు కావాలే అన్నట్టుగానే ప్రవర్తించింది.

చివరకు  ఓవ్యక్తి ఆ మందు తాగిన కోతిని మచ్చిక చేసుకుని పట్టుకుని  దూరంగా వదిలి పెట్టాడు. మందు మనుష్యులనే కాదు ఆఖర్కి జంతువుల చేత కూడా చిందేయిస్తుందని బెంగుళూర్ కోతి చేసిన హంగామా బట్టే తెలుస్తుంది, మందా మజాకా.