పండ్లు తోముట్ల  కోతులే  తోపులు - MicTv.in - Telugu News
mictv telugu

పండ్లు తోముట్ల  కోతులే  తోపులు

November 22, 2017

మనం మన దంతాలను శుభ్రం చేసుకోవడానికి, రకరకాల టూత్ పేస్టులు, వెరైటీ వెరైటీ బ్రష్‌లను వాడుతుంటాం కదా. కొందరైతే   రోజుకు రెండు మూడు సార్లు గుడ తోముతరు. అయినా గుడ సరిగ శుభ్రం కావు. కనీ పండ్లు తోముకునుట్ల మనకంటే  కోతులే నయమని శాస్త్రవేత్తలు జరిపిన అధ్యాయనంలో తేలింది.

మరి కోతులు ఏ టూత్ పేస్ట్ వాడుతయ్, ఏ బ్రష్‌లు వాడుతయ్ అన్కుంటున్రా, పక్షుల ఈకలు, కొబ్బరి పీసులు, వెంటుక్రలు, గడ్డి మొక్కలే  అవ్విటి పేస్టులు, బ్రష్ లట. మనదేశంలోని అండమాన్ ద్వీపాల్లో ఉన్న మెకాక్ అనే ఓ జాతి కోతిని, ఇంకా హిందూ మహా సముద్రం దగ్గరున్న దీవిలోని కోతులమీద పరిశోధనలు చేసి, ఈవిషయాన్ని కనిపెట్టారు.

అట్ల కొబ్బరి పీసులు, ఈకలతోని పండ్లు తోముకుంటే  మల్లా జీవితంల  దంత సమస్యలు రావని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనిషి కోతినుండే వచ్చిండని  అంటరు గనీ,  ఆరోగ్యంపై  వాటికున్న  శ్రద్ధ, ఇద్దెల ముందు మనం దండుగే అనిపిస్తుంది కదా.