2017లో క్రెడిట్, డెబిట్ కార్డుల్లో 1,700కు పైగా మోసాలు - MicTv.in - Telugu News
mictv telugu

2017లో క్రెడిట్, డెబిట్ కార్డుల్లో 1,700కు పైగా మోసాలు

March 17, 2018

2017 సంవత్సరంలో క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 1,700కు పైగా మోసాలు చోటు చేసుకున్నాయని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి కేజే ఆల్ఫోన్స్ పార్లమెంటుకు తెలియజేశారు. ఈ మోసాల్లో వినియోగదారులు రూ.71.48 కోట్ల మేర నష్టపోయారని తెలిపారు. ఇవన్నీ కూడా రూ.లక్ష ఆపైన విలువ కలిగిన మోసాలే. ఆలోపు విలువ కలిగినవి ఇంకా వేరే వున్నాయని చెప్పారు.30,222 ఫిషింగ్, ఓటీపీ చోరీ, విషింగ్ వంటి సమాచార తస్కరణ ఘటనలు గతేడాది అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో  ఎక్కువగా జరిగినట్టు చెప్పారు. ఆ మూడు నెలల్లో ఏటీఎం, పీవోఎస్ మెషిన్ల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.3.46 లక్షల కోట్లుగా ఉంది. ఆన్‌లైన్ చెల్లింపుల్లో రిస్క్‌ను పరిమితం చేసేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి పార్లమెంటుకు వివరించారు.