2 కోట్ల మందిని తట్టుకోలేక మరో 20 వేలు - MicTv.in - Telugu News
mictv telugu

2 కోట్ల మందిని తట్టుకోలేక మరో 20 వేలు

March 30, 2018

రైల్వేబోర్డు ఇటీవల 90 వేల ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి సుమారు 2 కోట్ల మంది దరఖాస్తులు చేసుకోవటంతో కంగు తిన్నారు రైల్వేశాఖ వాళ్ళు. దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయిందనుకున్నట్టున్నారు. ఇంత మందిలో కొంత మందికైనా తమ వంతుగా న్యాయం చెయ్యాలని అనుకున్నట్టున్నారు. తడవే మరో 20 వేల పోస్టులను పెంచాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుకుంది.  అదనంగా భర్తీ చేయదలచిన 20 వేల ఖాళీల్లో 9 వేల ఉద్యోగాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)లలో భర్తీ చేయనున్నారు. మరో పదివేల ఉద్యోగాలను ఎల్-1, ఎల్-2లో కేటగిరీల్లో భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వార్తతో నిరుద్యోగులకు ఊరట కలిగినట్టైంది. రైల్వే నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.