భార్యా భర్తలు కలిసి కన్యాదానం చేస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా చిన్నాన్న, చిన్నమ్మలు లేదా పెద్దమ్మ, పెదనాన్నలు, చేస్తారు. కానీ చెన్నైలో జరిగిన ఓ పెళ్ళిలో తల్లి మాత్రమే కన్యాదానం చేశారు. చెన్నైకి చెందిన రాజేశ్వరీ శర్మ కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. 17 ఏళ్ల తరువాత ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు.
తర్వాత రాజేశ్వరీ శర్మ తన కుమార్తె సంధ్యతో కలిసి నివసిస్తున్నారు. ఈ మధ్యే ఆస్ట్రేలియాకు చెందిన శ్యామ్ అనే యువకుడితో సంధ్యకు వివాహం నిశ్చయమైంది. తన పెళ్లికైనా అమ్మానాన్నలు కలిసి కన్యాదానం చేస్తారనుకున్నది కూతురు. కానీ ఆ తల్లి ఒంటరిగానే సంప్రదాయానికి వ్యతిరేకంగా కన్యాదానం చేయడం విశేషంగా మారింది.
తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్ళి జరిగింది. కొందరు ఇదెక్కడి విడ్డూరమని విమర్శలు సంధించినా.. చాలామంది రాజేశ్వరి సాహనాన్ని మెచ్చుకున్నారు. కాలాన్ని బట్టి సంప్రదాయాలు మారాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.