కన్నబిడ్డను కాపాడుకోవడానికి  తల్లిపాలను అమ్మకానికి పెట్టిన మాతృమూర్తి ! - MicTv.in - Telugu News
mictv telugu

కన్నబిడ్డను కాపాడుకోవడానికి  తల్లిపాలను అమ్మకానికి పెట్టిన మాతృమూర్తి !

February 5, 2018

ఈప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండొచ్చు.ఒక్కో దేశంలో ఒక్కోతీరుగా మనష్యుల వేష ,భాషలు ఉండొచ్చు. సంప్రదాయాలు పద్దతులు వేరు కావచ్చు..కానీ ఎక్కడికెళ్లినా తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే. ఈసృష్టిలో తల్లిప్రేమను మించిన ప్రేమ ఏదీ లేదనేది అక్షర సత్యం. కన్నపేగుకు ఏకష్టం రాకుండా తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. చైనాలో తన బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి ..తను బిడ్డకిచ్చే పాలను నడిరోడ్డుమీద అమ్మకానికి పెట్టింది. బిడ్డను కాపాడుకోవాలంటే లక్షలు కావాలి అని డాక్టర్లు చెప్పడంతో  పేదరికంలో ఉన్న ఆతల్లికి ఇది తప్ప వేరే దారి దొరకలేదు.నిమిషానికి 100 రూపాయలు తీసుకుని తల్లిపాలకు నోచుకోని బిడ్డలకు పాలిస్తానని రోడ్డు ప్రక్కన బోర్డు పెట్టుకుని భర్తతో పాటు నిలుచుంది. ఈమాతృమూర్తి కష్టాన్ని చూసిని చాలామంది ఆమెకు సాయం చేశారు. పాలను అమ్మగా కొంత డబ్బు , దయామయులు ఇచ్చిన మరికొంత డబ్బుతో  తన కన్నబిడ్డను ఎట్టకేలకు కాపాకోగలిగింది. అయితే ఈవిషయం తెలిసిన వారందరూ ఈమాతృమూర్తికి  సలాం చేస్తున్నారు. అమ్మా అనే మాటకే కొత్త అర్థం చెప్పావు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.