అయ్యో..ఎంత పని చేశావమ్మా... - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో..ఎంత పని చేశావమ్మా…

December 15, 2017

ఒక్కోసారి అనుమానాలు, అపార్థాలు ఆత్మహత్యలకు, హత్యలకు కారణం అవుతాయి. కానీ అసలు నిజం తెలిసినరోజు చేసిన తప్పును సరిదిద్దుకోలేక జీవితాంతం బాధపడినా ఏ ప్రయోజనం ఉండదు. ఎంత ఏడ్చినా చనిపోయినవాళ్లు మాత్రం తిరిగిరారనేది సత్యం. క్షణికావేశంలో అనుకోని నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటారు చాలా మంది.

నిర్మల్ జిల్లా పెర్కపల్లి గ్రామానికి చెందిన సుద్దాల లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సుద్దాల శ్రీనివాస్, లక్ష్మిలకు పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శ్రీజ (8), సిద్ధు (5) పిల్లలు ఉన్నారు. భర్త శ్రీనివాస్ బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. దీనితో లక్ష్మీ అత్తమామల దగ్గర ఉంటుంది. అయితే కొంత కాలంగా లక్ష్మికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన అత్తమామలు, ఆడిబిడ్డ తరచూ వేధించేవారు. ఈక్రమంలో వారి వేదింపులను తట్టుకోలేని లక్ష్మి మనస్థాపం చెంది  వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులు మీడియాకు వివరించారు.

కానీ లక్ష్మీ అన్న మాత్రం అత్త మామలు,ఆడబిడ్డ కలిసి నాచెల్లెలిని వారి పిల్లల్ని చంపేశారని ఆరోపిస్తున్నాడు. వాళ్ల చావుకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని లక్ష్మీ తల్లిదండ్రులు మరియు బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈఘటనపై విచారణ చేపట్టారు.