ప్రియాంకాకు  మదర్ థెరిసా  అవార్డు   - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకాకు  మదర్ థెరిసా  అవార్డు  

December 12, 2017

ప్రముఖ నటి ప్రియాంక చోప్రాను  మదర్ థెరిసా జ్ఞాపిక వరించింది. సామాజిక సేవల చేస్తున్నందుకు ప్రియాంకకు ఈ అవార్డును ప్రకటించారు.  ఇప్పటికే ప్రియాంక యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహిస్తుంది. అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రియాంక తన ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఆమె తల్లి మధు చోప్రా జ్ఞాపికను అందుకుంది. ఈ సందర్బంలో ప్రియాంక తల్లి  మీడియాతో మాట్లాడుతూ ‘ ఓ తల్లిగా ప్రియాంక లాంటి కుతురును కన్నందుకు చాలా గర్వంగా ఉంది. మనం ఎంత సాయం చేస్తే మనకు అంత ఎక్కువ లభిస్తుందన్న దానికి ప్రియాంకనే నిదర్శనం .

ప్రియాంకకు చిన్నప్పటి నుంచి మదర్ థెరిసా అంటే  చాలా ఇష్టం. ఆమెను స్పూర్తిగా తీసుకుని ఉత్తరప్రదేశ్ లోని బరైలీ ప్రాంతంలో ఉన్న ‘ప్రేమ్ నివాస్ ’ అనే వృద్దాశ్రమానికి విరాళాలు ఇచ్చేది. ఇంత చేస్తున్న నాకూతురు  ఈ అవార్డుకు అర్హురాలే’ అని ఆమె తెలిపింది. ప్రియాంక హాలీవుడ్ లో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల్లో నటిస్తుంది. ప్రముఖ అమెరికన్‌ టీవీ సీరీస్‌ ‘క్వాంటికో’లోనూ నటిస్తుంది.