తల్లి కోప్పడింది.. కొడుకు నిప్పంటించుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి కోప్పడింది.. కొడుకు నిప్పంటించుకున్నాడు

March 20, 2018

ఉగాది పండగ సంబరం ఇంకా తీరనేలేదు అప్పుడే ఆ ఇంట్లో తీరని విషాదం నిండిపోయింది. పండగనాడు ఇంటికి తెచ్చుకున్న మద్యాన్ని కుమారుడు ఒక్కడే తాగడంతో, తండ్రికి ఉంచకుండా ఎందుకు తాగావని తల్లి మందలించిందని మనస్తాపానికి గురై  ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, చిలకలగూడ పరిధిలోని నామాలగుండులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్, దేవయ్య తండ్రీ కొడుకులు. ఇద్దరూ అడ్డాకూలీలుగా నామాల గుండులో పనిచేస్తున్నారు. ఉగాది రోజున కూలీకి వెళ్ళారు ఇద్దరు తండ్రీకొడుకులు. పని అయిపోయాక ఇంటికి వస్తూ చెరో క్వార్టర్ బాటిళ్ళ మద్యం తెచ్చుకున్నారు.కాగా రాత్రిపూట మహేష్ తండ్రికి తెలియకుండా ఒక్కడే రెండు మద్యం బాటిళ్ళు తాగేశాడు. ఇది గమనించిన తల్లి మహేష్‌ను కోప్పడింది. తండ్రికి వుంచకుండా మొత్తం ఎందుకు తాగేశావని మందలించింది. దీంతో మత్తులో వున్న మహేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. బాధకు తాళలేక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మత్యువుతో పోరాడుతున్నాడు మహేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.