కృష్ణ మనవరాలు కూడా వచ్చేస్తోంది… - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణ మనవరాలు కూడా వచ్చేస్తోంది…

November 25, 2017

తల్లి దర్శకత్వంలో కూతురు వెండితెరకు పరిచయం అవడం అనేది చాలా అరుదైన సంఘటన. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, నటి, దర్శకురాలు మంజుల దర్శకత్వంలో ఆమె కూతురు జాన్వీ వెండితెరపై మెరవనుంది. ‘ షో ’, ‘ కావ్యాస్ డైరీ ‘ సినిమాలతో నటిగా అలరించిన మంజుల చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్నది. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ ప్రాముఖ్యమున్న పాత్రలో నటిస్తున్నది.

‘ జాన్వీని ఎప్పుడూ షూటింగులకు తీసుకువెళ్లలేదు. తాత, మామయ్యలు సినిమాల్లో ఆరితేరిన వారే. అయినా తనకు ఇది కొత్తే. తొలిషాట్ ఎలా చేస్తుందో అనుకున్నా గానీ చక్కగా చేసింది. తను అలా బిడియం లేకుండా నటిస్తుంటే నాకు అప్పట్లో బాలనటుడిగా నటించిన మహేషే గుర్తుకొచ్చాడు ’ అంటూ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది మంజుల.నటిగా కొనసాగాలన్న మంజుల.. కృష్ణ అభిమానుల నిరసలు, ఇతరత్రా కారణాల వల్ల నటనకు దూరమవడం తెలిసిందే.