మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత.. హైదరాబాదుకు తరలింపు… - MicTv.in - Telugu News
mictv telugu

మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత.. హైదరాబాదుకు తరలింపు…

December 7, 2018

టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి వచ్చింది. రక్తపోటు లెవల్స్ కూడా బాగా పడిపోవడంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ అందకపోవడంతో సొంత వాహనంలోనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది.Telugu news Motkupalli Narsimlu severe illness .. move to Hyderabad …ఈ విషయం తెలుసుకున్న మోత్కుపల్లి అనుచరులు, అభిమానులు, బీఎల్ఎఫ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయమై ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం రావాల్సివుంది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి

బయటకు వచ్చారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల పోలింగ్ రోజునే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.