రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదు ! - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదు !

February 1, 2018

కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ‘ బడ్జెట్‌లో రైతులకు  కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం. కనీస మద్దతు ధరలను 50% పెంచుతామని ఎన్నికల సమయంలో బిజెపి హామీ ఇచ్చింది.

అన్ని పంటలకు కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి. ఈ బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేది. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా పెద్దగా కేటాయింపులు లేవు.  ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచీ ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉంది. మహిళా శిశుసంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం.

పెద్దపెద్ద కంపెనీలను వదిలి..మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై ట్యాక్స్ వేయడం సరికాదు. ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో పనిచేస్తోన్న ఉపాధి హామీ కూలీలకు అకౌంట్‌లో డబ్బులు వేస్తామనడం సరైంది కాదు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలి. తెలంగాణ కు రైల్వే లైన్ల ఊసులేదు. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదు’ అని కవిత మండిపడ్డారు.