మోదీగారు అంటూ ఎంపీ శివప్రసాద్ పేరడీ పాట! - MicTv.in - Telugu News
mictv telugu

మోదీగారు అంటూ ఎంపీ శివప్రసాద్ పేరడీ పాట!

February 8, 2018

ఏదైనా సమస్యను, విమర్శను చెప్పాలంటే తనలో ఉన్న కళతో ఆటలాడి,పాటలు పాడి ,వేశాలేసి మరీ  టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రదర్శిస్తుంటారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆయన ఓ పేరడీ పాట పాడారు.

‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అన్న మోహన్ బాబు పాటను పేరడీ చేసి ‘విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు ఇస్తారయా..మోదీగారూ, మాకు పోలవరం వరమయ్యేదెప్పుడూ మోదీగారూ’ అని పేరడీ పాట పాడుతూ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద తప్పు చేసింది..మీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని శివప్రసాద్  వెనుక ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.