రాఫెల్.. ఫస్ట్ వికెట్ పడింది.. ఎంపీ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

రాఫెల్.. ఫస్ట్ వికెట్ పడింది.. ఎంపీ రాజీనామా

September 28, 2018

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తాకుతునే ఉంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. బిహార్‌లో ఉన్న ఒక్కగానొక్క ఎంపీ తారీఖ్ అన్వర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ తీరు నచ్చడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాఫెల్ ఒప్పందం గురించి ప్రధాని మోదీపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేవంటూ శరద్ పవార్ మాట్లాడటం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.

Bihar MP Tariq Anwar Resigned From The Lok Sabha Membership

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై ప్రజలకు, ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ శరద్ పవార్ మోదీకి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరం. అందుకే నేను పార్టీని వీడుతున్నాను.’ అంటూ అన్వర్ తెలిపారు. తాను ఏ పార్టీలో చేరాలనేది తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్వర్ స్పష్టం చేశారు.

శరద్ పవర్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ‌ని ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. పార్టీని వీడి, ఎన్సీపీని స్థాపించన సమయంలో అన్వర్ ఆయనుకు అండగా నిలిచారు. అంతేకాదు పార్టీలో కీలక పాత్ర పాత్ర పోషించారు. లోక్‌సభ ఐదుసార్లు, రాజ్యసభ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం కతియార్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఎన్సీపీని వీడిన అన్వర్ తిరిగి కాంగ్రెస్‌లోనే చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.