మన ఎంపీలు రూ. 1997 కోట్ల జీతాలు మింగారు.. ఆర్టీఐ - MicTv.in - Telugu News
mictv telugu

మన ఎంపీలు రూ. 1997 కోట్ల జీతాలు మింగారు.. ఆర్టీఐ

October 3, 2018

గత నాలుగు సంవత్సరాల్లో ఎంపీలు అందుకున్న జీతాలు ప్రోత్సాహకాలు రూ. 1997 కోట్లు. ఈ విషయాన్ని సమాచార చట్టం వెల్లడించింది. ఏడాదికి ఏంపీలు ఎంత వేతనం పొందుతున్నారు ? వారి జీతభత్యాల పద్దులెన్ని ? అంటూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. అతని అభ్యర్థనను స్వీకరించింది లోక్‌సభ. ఎంపీల జీతభత్యాల లెక్కలు వెల్లడించింది.

Rs 1,997 crore spent on salaries and perks of MPs in 4 years

లోక్‌సభ ఎంపీ  ఒక్కొక్కరు ఏడాదికి రూ. 71. 29లక్షల వేతనం పొందారని, అలాగే రాజ్యసభ సభ్యుడు రూ. 44.33 లక్షలను అందుకున్నారని ఆర్టీఐ తెలిపింది. గత నాలుగేళ్లలో లోక్‌సభ ఎంపీలు దాదాపు రూ.1554 కోట్ల పైచిలుకే వేతనాలను అందుకున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీలందరూ సుమారు రూ.443 కోట్ల వేతనం పొందారు. ఎంపీల వేతనాలు ఎక్కవగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాపై అధికభారం పడుతుందని  ఓ ఎన్జీవో అధినేత జగదీష్ ఛోకర్‌ ప్రభుత్వాన్ని కోరారు.