ఎంపీ కొడుకు వేధింపులు తాళలేక చచ్చిపోతున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ కొడుకు వేధింపులు తాళలేక చచ్చిపోతున్నా..

February 8, 2018

తన దగ్గర పని చేస్తున్న కారు డ్రైవర్ కేవలం రూ. 15 వేలు మాత్రమే బాకీ వున్నాడు. ఆ డబ్బుల కోసం తరచూ వేధించడంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. లక్షలు కాదు, కోట్లు కాదు.. కేవలం రూ. 15 వేల కోసం మనిషిని వేధించి ఆత్మహత్యకు పురిగొల్పుతారా? అని గుంటూరులో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా మందిని ఆందోళనకు గురిచేసింది.  టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావుపై ఆరోపణలు చేస్తూ బాధితుడు వెంకటేష్ సూసైడ్ నోట్‌లో రాశాడు.        ‘రంగారావు, ఆయన కుమార్తె దగ్గర కారు డ్రైవర్‌గా పని చేసినప్పుడు అడ్వాన్స్‌గా రూ.15 వేలు తీసుకున్నాను. అవి చెల్లించకపోతే చంపుతానని రంగారావుతో పాటు కోటపాటి పూర్ణచంద్రలు నన్ను బెదిరిస్తున్నారు ’ అని వెంకటేష్ సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి  పాల్పడిన వెంకటేష్‌ను గుంటూరు జీహెచ్‌కు తరలించారు. ‘ కులం పేరుతోనూ నన్ను వేధించారు. తన ఆత్యహత్యకు కారణం ఆ ముగ్గురే.. వారిపై చర్యలు తీసుకోవాలి ’ అని పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి  వుంది.