ఈ ఏడాది భారతీయ మగాడు ఇతడే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఏడాది భారతీయ మగాడు ఇతడే..

December 15, 2017

మిస్టర్ ఇండియా వరల్డ్ -2017 టైటిల్‌ను జితేశ్ సింగ్  డియో అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేశ్ హ్యాండ్సమ్ లుక్కులు, బాడీతో  అందర్నీవెనక్కి నెట్టేసి  టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ పోటీని ముంబైలోని బాంద్రా పోర్టులో నిర్వహించారు. ఈ పోటీలకు  బాలీవుడ్ నటి కంగనా రౌనత్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా, టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి  న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు.  tచివరిగా విజేతలను ప్రకటించారు. తొలి రన్నరప్‌గా అభి కజూరియా (చండీగఢ్) నిలువగా,రెండొ రన్నరప్‌గా పవన్ రావ్ (ముంబై) నలిచాడు. వీరు త్వరలో జరగబోయే మిస్టర్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు.