దయచేసి నాభర్త బారినుండి కాపాడండి..! - MicTv.in - Telugu News
mictv telugu

దయచేసి నాభర్త బారినుండి కాపాడండి..!

February 5, 2018

‘నా భర్త నన్ను హింసిస్తున్నాడు. ఇది ఈ నాటిది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోంది. అతనో అమ్మాయిల పిచ్చోడు. పేకాట ఆడి  అప్పుల పాలయ్యాడు. పైగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. నాభర్త తీరు మారకపోవడం నేను నా కూతురితో ఆయనకు దూరంగా ఉంటున్నాం. అయినా డబ్బు కోసం నన్ను వేధిస్తూ వస్తున్నాడు,నా పేరు మీద ఉన్న ఫ్లాట్‌ను తన పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడు. పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, ప్లీజ్ దయచేసి నన్ను కాపాడండి’ అని ఏడుస్తూ ముంబైకి చెందిన ఓమహిళ వీడియోను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఆవీడియో వైరల్‌గా మారింది. అందరూ సైకో భర్తపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అశోక్‌ పండిట్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈవీడియో పోలీసులకు చేరడంతో సైకో భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.