ముచ్చట విత్ డివి. మోహనకృష్ణ

ప్రముఖ వాగ్గేయకారుడు బాలమురళి కృష్ణ గారి అత్యంత ప్రియశిష్యుడు, సంగీత విధ్వాంసుడు డివి. మోహన కృష్ణ గారి అంతరంగం తెలుసుకుందాం. సంగీతం అంటే పూర్వ జన్మ సుకృతం అని భావిస్తారు ఆయన. కళ్ళు చీకటి అయిపోయినా కళలో వెలుగును చూసుకుంటున్నాడు. ప్రముఖ నాటకరంగ నిపుణులు దీవీ సుబ్బరావు, ఈయనకు స్వయానా తాతా అవుతారు. నాటకాల్లో పద్యాలు పాడటం వల్ల తనకూ ఆ విద్య అబ్బంది అంటున్నారు.

ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద సంగీతం, శాస్త్రంలో శిక్షణ తీసుకున్నారు. ఘంటసాల పాటలంటే చెవి కోసుకుంటానంటారు. త్యగారాయ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అలవోకగా ఆలపించడంలో ఆయనకు సాటి రారు ఎవ్వరు. ఆయన ఇంకా ఎన్నో మనకు తెలియని విషయాలు చెప్పారు. బోలెడు గీతాలు ఆలపించారు. చక్కగా యాంకర్ మంగ్లీతో ముచ్చట్లు పెట్టారు. ఆయన అంతరంగాన్ని మథించిన పసందైన ముచ్చట ఇది. క్రింది లింకులో మీరూ చూడండి.