మనం మళ్లీ మళ్లీ విన్న ఎన్నో పాటలు అతను రాసినవే ! - MicTv.in - Telugu News
mictv telugu

మనం మళ్లీ మళ్లీ విన్న ఎన్నో పాటలు అతను రాసినవే !

March 10, 2018

సినిమా పాటలు, జాతర పాటలు, ఉద్యమ పాటలు,బతుకమ్మ పాటలు ఇలా ఏ పాటైనా సరే ఒక్కసారి ఆయన పేపరుపై పెన్ను పెట్టారంటే..పదాలు అందంగా ముస్తాబై  చెవులకు వినసొంపుగా మారతాయి. ప్రాసతో కూడిన పరమార్థం ప్రతి పాటలో దాగుంటుంది. ఆయనే ప్రముఖ పాటల రచయిత కందికొండ. మనం చాలా సార్లు మళ్లీ మళ్లీ విన్న ఎన్నో వందల పాటలు ఆయన కలంలోంచి, ఆయన ఆలోచనల్లోంచి పుట్టినవే. దాదాపు అందరు స్టార్ హీరోలకూ ఆయన పాటలు రాశారు.

పండుగ సందడి,పల్లె పరిమళం, ఎమోషన్, లవ్ ఇలా ఏ జోనర్ పాటలైనా సునాయాసంగా రాయగల సత్తా కందికొండ సొంతం.  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో కందికొండ చాలా పాటలు రాశారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలో రాసిన మల్లి కూయవే గువా..మోగిన అందిన మువ్వా అనే పాటతో మొదలైన కందికొండ సినీ ప్రస్థానం..17 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఆయన రాసిన ప్రైవేట్ పాటలు ఇప్పుడు య్యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

రేలారే రేలారే, సంక్రాంతి పాట, మేడారం పాట ఇలా చెప్పుకుంటే పోతే  ఎన్నో పాటలకు అద్భుతమైన లిరిక్స్ ను అందించారు.  కందికొండ మొదలు పెట్టిన పాటల గని కొండ గురించి ఆయన చెప్పిన ఎన్నో విశేషాలు…ఇన్ని పాటలు రాసినా కూడా తగిన గుర్తింపు ఆయనకు లభించలేదు, దీనికి గల కారణాలేంటి? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను కందికొండ మైక్‌టీవీతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.