‘పద్మావతి’ వ్యతిరేకులకు ములాయం కోడలి డ్యాన్స్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

‘పద్మావతి’ వ్యతిరేకులకు ములాయం కోడలి డ్యాన్స్ షాక్

November 29, 2017

పద్మావతి’ సినిమాపై ఓవైపు చాలా రాష్ట్రాల్లో నిరసనలు,కొట్లాటలు జరుగుతుంటే… ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ.. ‘పద్మావతి’ వ్యతిరేకులకు పెద్ద షాకే ఇచ్చింది.

తన సోదరుడి నిశ్చితార్థంలో ‘పద్మావతి’ సినిమాలోని ఘూమర్ పాటపై డ్యాన్స్ చేసింది. ఘూమర్ పాటపై అపర్ణ వేసిన స్టెప్పులకు..ఫంక్షన్‌కు వచ్చిన వారంతా ఫిదా అయ్యారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్‌పై రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన మండిపడింది.

చరిత్రను వక్రీకరించిన సినిమా ‘పద్మావతి’ అని ఇప్పటికే  పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌,బీహార్  రాష్ట్రాలు ఈసినిమాను  నిషేదించాయి. మరి ఇలాంటి సందర్భంలో ములాయం కోడలు చేసిన డ్యాన్స్ వివాదాస్పదమైంది.