కన్నతల్లి లాంటి పార్టీని ఎందుకు వీడానంటే - MicTv.in - Telugu News
mictv telugu

కన్నతల్లి లాంటి పార్టీని ఎందుకు వీడానంటే

November 1, 2017

తెలుగుదేశం మాజీ సభ్యురాలు ములుగు సీతక్క మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరకు ముందు ములుగు నియోజకవర్గం ప్రజలకు తాజా రాజకీయ పరిమాణాల నేపథ్యంలో, తాను తీసుకున్న నిర్ణయాన్ని వివరిస్తూ బహిరంగా లేఖను రాసారు. ఆ లేఖలో ఇలా ఉంది

‘ గత 15 రోజుల నుంచి చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితిలో నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణంలోకి తీసుకున్నాను. కన్నతల్లి లాంటి తెలుగు దేశం పార్టీని వీడేందుకు నేనేంత గుండె నిబ్బరాన్ని కోల్పోయానో చెప్పలేను. అయిన  ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సీ అవసరం  ఏర్పడింది. ఇది వ్యక్తుల కోసం  కాదు. వ్యవస్థ కోసం తీసుకున్న నిర్ణయం.

ప్రస్తుతం తెలంగాణలో అణచివేతకు గురివుతోంది. ప్రశ్నించే  గొంతులను కాపాడుకోవాల్సిన బాధ్యత  మనందరిపై ఉందని భావించాను. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టుకువచ్చింది.  తెలంగాణలో అనేక మార్పులు, అభివృద్దికి కారణమైంది టీడిపీ . అంతటి ఘనమైన  రాజకీయ పార్టీని చంపాలని చూస్తున్నారు. నా తల్లిని చంపాలనుకున్న వారికి బుద్ది చెప్పాలనుకుంటున్న .

కానీ నాశక్తి సరిపోవడం లేదు.  నాకు ఒక వేదిక కావాలి.అందుకే తెలంగాణ రావడానికి కారణం అయిన  టీడీపీ,కాంగ్రెస్‌లను నాశనం చేయాలనుకున్న వారికి బుద్ది చెప్పాలనుకుంటున్నాను. ఇంతకంటే వేరే  మార్గం నాకు కన్పించండం లేదు’.

‘టీఆర్ఎస్‌లోకి వెళితే మూటలు వస్తాయి అన్నారు. కానీ నాకు మూటలు కాదు . ప్రజలకిచ్చిన మాటలు కావాలి . ములుగును జిల్లా చేస్తానని ప్రజలకు సీఎం మాట ఇచ్చి తప్పారు. ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వాన్ని, సీఎంను  పొగడటం నా వల్ల కాదు.

నేను నడిచే ముళ్లబాటే అయిన నన్ను నమ్ముకున్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి  దేన్నేనా ఎదుర్కొవడాకి తాను సిద్దంగా ఉన్నాను. మీరంతా నాకు తోడుగా ఉండి ఆశ్వీరదించి, నా పోరాటంలో నాతో నడుస్తారని , మీ అండదండలు అందిస్తారని ఆశిస్తూ’ మీ సీతక్క అని ఆ లేఖలో పేర్కొన్నారు.