నరరూప రాక్షసుడు విడుదల కాబోతున్నాడు... - MicTv.in - Telugu News
mictv telugu

నరరూప రాక్షసుడు విడుదల కాబోతున్నాడు…

November 22, 2017

ముంబై డాడుల్లో 170 మందిని పొట్టనబెట్టున్న 26/11 దాడుల ప్రధాన సూత్రదారి అయిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్  గురువారం విడుదల కాబోతున్నాడు. అతనిపై ఉన్న ఆరోపణలకు సరైL సాక్ష్యాదారాలను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేకపోయింది.

దీంతో అక్కడ  పంజాబ్ రాష్ట్ర హైకోర్టుకు చెందిన జ్యూడీషియల్ రివ్యూ బోర్డు అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. గత నెలలోనే గృహనిర్భంధంలో ఉన్న అతని అనుచరులను కూడా కోర్టు విడుదలకు ఆదేశించింది. సయీద్‌ లాంటి ఉగ్రవాదులను విడుదల చేస్తే పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా చాలా ఆంక్షలు వచ్చే  అవకాశం ఉందని  ప్రభుత్వం కోర్టుకు చెప్పినా కూడా ఫలితం లేకపోయింది. సాక్ష్యాదారాలు లేనందున  నరమేధం సృష్టించిన సయిద్ లాంటి వాళ్లకు విడుదల లభించింది.