మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్యతో కలిసి చేసిన  పాట ! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్యతో కలిసి చేసిన  పాట !

February 27, 2018

ముంబై చుట్టూ ఉన్న నదులను కాపాడుకోవడానికి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్  తన భార్య అమృతతో కలిసి ఓ వీడియో సాంగ్ చేశాడు. ‘ముంబై చుట్టూ నాలుగు నదులు ఉన్నాయి. వాటి పేర్లు పొయ్ సర్,దహిసర్, ఓషివారా, మితి నదులు. అయితే వీటిని కాపాడుకోవాల్సిన  బాధ్యత మనందరిపై ఉందంటూే..సియం అతని భార్య ఈ పాటలో వేడుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అయితే ఈ వీడియోపై  ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనిపై  ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.  ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాత్రం దీనిపై  క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక సామాజిక అంశం  దీనిపై కూడా విమర్శలు తగదు. అయితే ఈ పాటను ‘మా స్వంత ఖర్చుతో  రూపొందించాం. ప్రభుత్వానిది  ఒక్కపైసా కూడా ఉపయోగించలేదు’ అని సియం వివరించారు. ప్రముఖ సింగర్  సోనూ నిగమ్  కూడా ఈ పాటలో భాగమయ్యాడు.