mictv telugu

17 రోజులు ఏటీఎంకు వెళ్లి.. వాడిని పట్టుకుంది..

January 10, 2019

డబ్బుపోతే గుండె తరుక్కుపోతుంది. అది కూడా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు పోతే ఊపిరి ఆడదు. మోసపోయి పోగొట్టుకుంటే ఆ వేదన మాటలకు అందదు. అందుకే ఆమె తన డబ్బును కొట్టేసిన వంచకుడి కోసం దృఢసంకల్పంతో మాటువేసి, అనుకున్నది సాధించింది. వరుసగా 17 రోజుల పాటు ఏటీఎం వద్దకు వెళ్లి ఆ దొంగోడి ఆచూకీ కోసం కళ్లతో జల్లెడపట్టింది. ముంబైలో జరిగిందీ సంఘటన.

Telugu news Mumbai Woman visits ATM where she was duped for 17 days, nabs culprit

 

ఏడాది డిసెంబర్‌ 18న బాంద్రా ప్రాంతానికి  చెందిన రెహనా షేక్‌ అనే 35 ఏళ్ల మహిళ తాను పనిచేస్తున్న ఆఫీసుకు సమీపంలోని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోడానికి వెళ్లింది. ఏటీఎం కార్డుతో రూ.10 వేలు డ్రా చేసింది. అయితే సాంకేతిక లోపం వల్ల నోట్లు బయటికి రాలేదు. ఏటీఎం బయటి నుంచి ఆ విషయాన్ని భూపేంద్ర మిశ్రా అనే ప్రభుత్వం లోపలికి వెళ్లాడు. సాయం చేస్తానంటూ ఆమె ఏటీఎం వివరాలు తీసుకున్నాడు. అయినా డబ్బులు రాలేదు. దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. అయితే  రూ.10 వేలు డ్రా చేసినట్లు ఆమె ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అనుమానంతో రెహనా ఏటీఎం వద్దకు వెళ్లగా.. మిశ్రా అయిపు లేకుండా పోయాడు. రెహనా అతణ్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుంది. రోజూ, ఆఫీసుకు వస్తున్నప్పుడు, ఆఫీసు నుంచి ఇంటికి పోతున్నప్పుడు ఆ పనికిమాలిన ఏటీఎం వద్ద కాసేపు నుంచుని దొంగోడి కోసం వెతికేది. మొత్తానికి ఆమె కష్టం ఫలించింది. ఈ నెల 4న మిశ్రా ఆ ప్రాంతంలో తచ్చాడుతుండగా.. రెహానా అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. మిశ్రా పాత నేరస్తుడని, అతని చాలా చీటింగ్‌ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

Telugu news Mumbai Woman visits ATM where she was duped for 17 days, nabs culprit