నీరవ్ మోదీని కాల్చేపారేస్తారు.. - MicTv.in - Telugu News
mictv telugu

నీరవ్ మోదీని కాల్చేపారేస్తారు..

March 1, 2018

చెడుపై మంచి విజయం సాధించినందుకు హోళీ పండగను జరుపుకుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 11400 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కెసిన నీరవ్ మోదీ చెడ్డవాడని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అతని దిష్టిబొమ్మను కాసేపట్లో కాల్చిపడేయనున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలోని బీడీడీ చాల్ ఏరియాలో మోదీ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తు ఉన్న నీరవ్ దిష్టిబొమ్మను తయారు చేయించి మరీ దహన కార్యక్రమాలకు సిద్దమయ్యారు. ఈ వార్తలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు మోదీని ఎలాగూ పట్టుకోలేకపోయారని, జనమైనా ఇలా కాల్చేసినందుకు సంతోషంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రభుత్వాలు అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే జనమే వారి పని పడతారని అంటున్నారు.