బాలకృష్ణ ఇంటిముందు మున్సిపల్ కార్మికుల ఆందోళన… - MicTv.in - Telugu News
mictv telugu

బాలకృష్ణ ఇంటిముందు మున్సిపల్ కార్మికుల ఆందోళన…

November 21, 2018

జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పారశుద్ధ్య కార్మికులు, టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు. 220 మంది మున్సిల్ కార్మికులు హిందూపురంలోని ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో వారు భగ్గుమన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని ఈడ్చుతుండగా అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.Telugu news Municipal workers' protest at Balakrishna's house ... GO 279 should be canceled …